ముఖ్య కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు సంపద

పొడుపు కథలు — సంపుటి 1

50 పొడుపులు · సమాధానాలతో · సంపుటి 1/12

జవాబు ఊహించండి, తర్వాత "జవాబు చూడండి" నొక్కి సరిచూసుకోండి — పిల్లలతో పెద్దలతో కలిసి ఆడే సరదా ఆట! Guess each riddle before revealing the answer.

  1. 1. మూడు కాళ్ళతో ముందుకు వెళ్తుంది, కానీ వెనకు మాత్రం రాలేదు, ఏమిటో చెప్పండి?

    జవాబు చూడండి

    జ. కాలం

  2. 2. అందరినీ పైకి తీసుకెళ్తాను కానీ నేను మాత్రం వెళ్లలేను నేను ఎవరు

    జవాబు చూడండి

    జ. నిచ్చెన

  3. 3. నాకు కన్నులు చాలా ఉన్నాయి కానీ చూసేది రెండు తోనే నేను ఎవర్ని

    జవాబు చూడండి

    జ. నెమలి

  4. 4. నామము ఉంది గాని పూజారిని కాదు వాళ్ళ ఉంటుంది కానీ కోతి ని కాను నేను ఎవర్ని

    జవాబు చూడండి

    జ. ఉడుత

  5. 5. పుట్టింది అడవిలో పెరిగింది మంచి రోజు చూసింది మన పక్క చేరింది ఏమిటది

    జవాబు చూడండి

    జ. మంచం

  6. 6. రాజు గారి తోటలో రోజాపూలు చూచేవారే గాని కోసేవారు లేరు ఏమిటవి

    జవాబు చూడండి

    జ. నక్షత్రాలు

  7. 7. అమ్మ తమ్ముడు ని కాదు కానీ మీ అందరికీ మేనమామ ని నేనెవర్ని

    జవాబు చూడండి

    జ. చందమామ

  8. 8. పొట్టి వాడికి పుట్టినంత బట్టలు

    జవాబు చూడండి

    జ. ఉల్లిపాయ

  9. 9. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు పట్టుకుని వేలాడుతూ ఉంది కానీ పడుకోదు

    జవాబు చూడండి

    జ. తాళం

  10. 10. ఏమి లేనమ్మా ఎగిరెగిరి పడుతుంది అన్ని ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుంది

    జవాబు చూడండి

    జ. విస్తరాకు

  11. 11. ఎటు అవతల ఒకరు ఎటు యువతలో ఒకరు ఇద్దరు కలిస్తే గాని రాగాలు రావు

    జవాబు చూడండి

    జ. Ans.పెదవులు

  12. 12. రెండు చేతులు ఉంటాయి కానీ పట్టుకో లేడు నాలుగు కాళ్ళు ఉంటాయి కానీ నడవలేడు ఉంటుంది కానీ ముఖము లేదు

    జవాబు చూడండి

    జ. కుర్చీ

  13. 13. చాపలు చుట్టలే పైసలు ఏం చేయలేం

    జవాబు చూడండి

    జ. ఆకాశం నక్షత్రం

  14. 14. అందమైన చెరువులో ముద్దొచ్చే పీట్ట మూతి బంగారం తోకతో నీళ్ళు తాగు

    జవాబు చూడండి

    జ. దీపం

  15. 15. తోక లేని పిట్ట తొంభై కోసులు పోతుంది

    జవాబు చూడండి

    జ. ఉత్తరం

  16. 16. పడగవిప్పిన పాత సారి పై లంగా పోతాడు ఎండకు వానకు లొంగడు గాలికి గడగడా వణుకుతారు

    జవాబు చూడండి

    జ. చత్రి

  17. 17. ముక్కు మీద కెక్కు ముందర చెవుల నొప నొక్కు జారిందంటే పుటుక్కు

    జవాబు చూడండి

    జ. అద్దాలు

  18. 18. కటకట రాముల కడుపులో పుడితే ఏమైపోయావ్ పుడతివు ఏం సుఖపడితే వి ఆడదాని తో ఆడుకుంటే పోయి అఖిల పడితిని

    జవాబు చూడండి

    జ. పిడక

  19. 19. దాని మొదలు చెరకు మొదలు, దాని ఆకు తామరాకు, దాని పూత మెడిపూత దాని కాతా గాజి కథ

    జవాబు చూడండి

    జ. ఆముదం చెట్టు

  20. 20. కట్లగల్టి అధిట్ల శాస్తి రొట్ల రుబ్బురైకి తాగాలి రోసనికి వస్తి

    జవాబు చూడండి

    జ. సున్నం

  21. 21. కిట కిట తలుపులు, కిటారి తలుపులుఎప్పుడు మూసిన చప్పుడు కావు, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. కంటి రెప్పలు

  22. 22. అడవిలో పుట్టింది, మెదరింట్లో మెలిగిందివంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. మురళి

  23. 23. చారల పాము, చక్కటి పామునూతిలో పాము, నున్ననైనా పాము, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. పోట్లకాయ

  24. 24. నాదశ్వరానికి లొంగని త్రాచు,నిప్పంటించగానే ఆడెత్స్తుంది, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. చిచ్చుబుడ్డి

  25. 25. తొడిమ లేని పండు, ఆకు లేని పంట, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. విభూది పండు

  26. 26. తలనుండి పొగ చిమ్ముతుండు, భూతం కాదుకన్ను లెర్రగా ఉండు, రాకాసి కాదుపాకి పోవు చుండు, పాము కాదు, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. రైలు

  27. 27. సన్న తోడవు తొలగిస్తే, కమ్మని వెన్నముద్దఅందరూ ఇష్టంగా ఆరగిస్తారు, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. అరటిపండు

  28. 28. అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. నక్షత్రాలు

  29. 29. అంగుళం ఆకు, అడుగున్నర కాయ, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. ములక్కాయ

  30. 30. అంగుళం గదిలో, అరవై మంది నివాసం, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. అగ్గిపెట్టె

  31. 31. అరచేతి పట్నాన అరవై రంధ్రాలు, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. జల్లెడ

  32. 32. ఈ ఇంటికి, ఆ ఇంటికి మధ్య ఒకటే దూలం, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. ముక్కు

  33. 33. ఎందరెక్కినా విరగని మంచం, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. అరుగు

  34. 34. ఎండిన బావిలో పిల్లలు గంతులేస్తారు, అవి ఏంటి ?

    జవాబు చూడండి

    జ. పేలాలు

  35. 35. ఎర్రని కోటలో తెల్లని భటులు, అవి ఏంటి ?

    జవాబు చూడండి

    జ. పళ్ళు

  36. 36. ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. కాకర కాయ

  37. 37. కన్ను ఉన్నా తలలేనిది, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. సూది

  38. 38. చారెడు కుండలో మానెడు పగడాలు, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. దానిమ్మ పండు

  39. 39. చూస్తే ఒకటి, చేస్తే రెండుతలకు తోకకు ఒకటే టోపీ , నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. పెన్ను

  40. 40. చూస్తే గజి బిజీ, తింటే కరకర, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. జంతిక

  41. 41. చిత్రమైన చీరకట్టి షికారుకెళ్ళిందో చిన్నదిపూసిన వారింటికే గాని, కాసిన వారింటికి పోనే పోదు. అది ఏంటి ?

    జవాబు చూడండి

    జ. సీతాకోక చిలుక

  42. 42. నీరులేని సముద్రాన్ని భద్రంగా దాటించెను ఈ ఓడ! నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. ఒంటె (ఎడారి ఓడ)

  43. 43. హద్దు లేని పద్దు, అదుపు లేని ఎద్దుఎన్నడూ ఆడొద్దూసుమా! నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. అబద్దం

  44. 44. దాని పువ్వు పూజకు పనికిరాదు,దాని ఆకు డొప్పగా చేయటానికి సాయపడదుకానీ దాన్ని అందరూ కోరతారు, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. చింత పండు

  45. 45. నాకు నోరు లేదు కానీ మాటలాడుతాను,చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ తెలియ చేస్తాను, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. మైకు

  46. 46. క్రమమైన పయనం, నల్లపూసల సైన్యం, నేను ఎవరిని ?

    జవాబు చూడండి

    జ. నల్ల చీమల దండు

  47. 47. అవి తెల్లని మల్లె మొగ్గలు, పరిమళాలు వెదచల్లవు కానీ, పరి శుభ్రంగా ఉంచుతాయి, అవి ఏంటి?

    జవాబు చూడండి

    జ. ఇయర్ బడ్స్

  48. 48. యంత్రం కానీ యంత్రం, నేను ఎవరిని?

    జవాబు చూడండి

    జ. సాయంత్రం

  49. 49. అరిచి గోల పెట్టె రాళ్లు, నేను ఎవరిని?

    జవాబు చూడండి

    జ. కీచు రాళ్లు

  50. 50. నగరాలూ, పట్టణాలు దాటేస్తుంది,ఎంతెంత దూరమైనా వెళుతుందికానీ ఉన్నచోటు నించి కదలదు, అది ఏంటి ?

    జవాబు చూడండి

    జ. రహదారి

ఇంకా చదవండి

సాంప్రదాయ తెలుగు పొడుపు కథలు (traditional folk riddles), compiled from public sources.