పొడుపు కథలు — సంపుటి 2
50 పొడుపులు · సమాధానాలతో · సంపుటి 2/12
జవాబు ఊహించండి, తర్వాత "జవాబు చూడండి" నొక్కి సరిచూసుకోండి — పిల్లలతో పెద్దలతో కలిసి ఆడే సరదా ఆట! Guess each riddle before revealing the answer.
-
1. కొంచమైనా కాన రాని పసుపు, వొళ్ళంతా పులుపు,పైనేమో నునుపు, నేను ఎవరిని?
జవాబు చూడండి
జ. నిమ్మ పండు
-
2. దొంతర దొంతర దుస్తులు, బంగారు వన్నె జుట్టుకలిగిన తల్లికి ఎంతో అందమైన పిల్లలు, అవి ఏంటి?
జవాబు చూడండి
జ. మొక్కజొన్న కంకి
-
3. చక్కనమ్మ చిక్కినా అందమే, నేను ఎవరిని?
జవాబు చూడండి
జ. సబ్బు
-
4. చేత్తో పారేసి, నోటితో ఏరుకునేవి, అవి ఏంటి?
జవాబు చూడండి
జ. అక్షరాలు
-
5. నాలుగు కర్రల మధ్య నల్లని రాయి, అది ఏంటి ?
జవాబు చూడండి
జ. పలక
-
6. ఒక స్తంభానికి నలుగురు దొంగలు, నేను ఎవరిని?
జవాబు చూడండి
జ. లవంగం
-
7. కానరాని విత్తనం, ఘనమైన చెట్టు, నేను ఎవరిని?
జవాబు చూడండి
జ. మర్రిచెట్టు
-
8. పచ్చని చెట్టు కింద ఎర్రని చిలుక, నేను ఎవరిని?
జవాబు చూడండి
జ. మిరప పండు
-
9. ఊరంతా తిరిగి, మూలాన కూర్చునేది, నేను ఎవరిని?
జవాబు చూడండి
జ. చెప్పులు
-
10. అది మనకి మాత్రమే సొంతమైనది. కానీ మన కన్నా ఇతరులే వాడుకుంటారు, నేను ఎవరిని?
జవాబు చూడండి
జ. పేరు
-
11. కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి?
జవాబు చూడండి
జ. సీతాకోక చిలుక
-
12. రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది!! అదేమిటి?
జవాబు చూడండి
జ. Ans ఉత్తరం
-
13. మోదం కాని మోదం!!ఏమిటి అది ?
జవాబు చూడండి
జ. ఆమోదం
-
14. మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన ,ఏమిటి అది ?
జవాబు చూడండి
జ. పాలు, పెరుగు, నెయ్యి
-
15. రసం కాని రసం, ఏమి రసం, ఏమిటి అది?
జవాబు చూడండి
జ. నీరసం
-
16. ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం,నేను ఎవరిని ?
జవాబు చూడండి
జ. తేనె పట్టుని
-
17. మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ అది ?
జవాబు చూడండి
జ. లవంగ మొగ్గ
-
18. మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు,ఏమిటి అది ?
జవాబు చూడండి
జ. తేనె పట్టు
-
19. మూత తెరిస్తే, ముత్యాల పేరు,ఏమిటి అది ?
జవాబు చూడండి
జ. దంతాలు
-
20. పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి, చూసే వారే కాని పట్టే వారు లేరు,ఏమిటి అది ?
జవాబు చూడండి
జ. సూర్యుడు
-
21. పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే,నేను ఎవరిని ?
జవాబు చూడండి
జ. దీపం
-
22. పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు, ఏమిటి అది ?
జవాబు చూడండి
జ. పత్తి పువ్వు
-
23. లాగి విడిస్తేనే బ్రతుకు!! అదేమిటి?
జవాబు చూడండి
జ. ఊపిరి
-
24. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది!! అదేమిటి?
జవాబు చూడండి
జ. వేరుశెనగ కాయ
-
25. జాన కాని జాన, ఏమి జాన!!ఏమిటి అది ?
జవాబు చూడండి
జ. ఖజాన
-
26. చిన్న పాపకు చాలా చీరలు,ఏమిటది ?
జవాబు చూడండి
జ. ఉల్లిపాయ
-
27. రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు ?
జవాబు చూడండి
జ. మంగలి
-
28. రాజు నల్లన, ప్రధాని పచ్చన, పాలు పుల్లన,ఏమిటది ?
జవాబు చూడండి
జ. తాటి చెట్టు
-
29. రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు,ఏమిటది ?
జవాబు చూడండి
జ. తేలు
-
30. అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది,ఏమిటి అది ?
జవాబు చూడండి
జ. దీపం వత్తి
-
31. ఎంతదానంచేసినతరగనిదిఅంతకంతకుపెరిగేది,అదిఏమిటి?
జవాబు చూడండి
జ. Ans.విద్య
-
32. గదినిండారత్నాలుగదికితాళం,నేనుఎవరిని ?
జవాబు చూడండి
జ. Ans.దానిమ్మపండు
-
33. కోస్తేతెగదుకొడితేపగలదు,ఏమిటి అది?
జవాబు చూడండి
జ. Ans.నీడ
-
34. నాలుగుకర్రలమధ్యనల్లరాయి,ఏమిటి అది?
జవాబు చూడండి
జ. Ans.పలక
-
35. చేతికిదొరకనిదిముక్కుదొరుకుతుంది,ఏమిటి అది?
జవాబు చూడండి
జ. Ans.వాసన
-
36. పళ్ళునానోరులేనిది,ఏమిటి అది?
జవాబు చూడండి
జ. Ans.రంపం
-
37. ఆకుచిటికెడుకాయమూరెడు,నేనుఎవరిని ?
జవాబు చూడండి
జ. Ans.మునగ కాయని
-
38. చిట్టపోటీచిన్నదానికిచిన్నఘనమైనలేదు,ఏమిటి అది?
జవాబు చూడండి
జ. Ans.గుడ్డు
-
39. పొద్దునతలుపుతట్టిఉత్సాహాన్నిఇచ్చేవాడుజీతంతీసుకోకుండాశుభ్రంగాచేసేవాడుఆరోగ్యంతోఆహ్లాదాన్నిపంచేవాడు,ఏమిటి అది?
జవాబు చూడండి
జ. Ans.సూర్యుడు
-
40. తొడిమలేనిపండుఆకులేనిపంటఏంటవి?
జవాబు చూడండి
జ. Ans.విభూదిపండు
-
41. కందుకూరికామాక్షికాటుకపెట్టుకుంది,ఏమిటి అది ?
జవాబు చూడండి
జ. Ans.గురువిందగింజ
-
42. ఒకఅగ్గిపెట్టెలోఇద్దరుపోలీసులు,ఏమిటి అది ?
జవాబు చూడండి
జ. Ans.వేరుశెనగకాయ
-
43. ఇంట్లోముగ్గుబయటపువ్వు ,ఏమిటి అది ?
జవాబు చూడండి
జ. Ans.గొడుగు
-
44. నువ్వుఅన్నదమ్ములకుఒకటేమొలతాడు,ఏమిటి అది?
జవాబు చూడండి
జ. Ans.చీపురు
-
45. పచ్చనిబాబుకిరత్నాలముగ్గులు,నేను ఎవరిని?
జవాబు చూడండి
జ. Ans.విస్తరాకు
-
46. చక్కనిస్తంభంచెయ్యనికుండపొయ్యనినీళ్ళువెయ్యనిసున్నంతియ్యగనుండు,ఏమిటి అది ?
జవాబు చూడండి
జ. Ans.కొబ్బరిబొండం
-
47. పిల్లచిన్నదానకట్టినచీరలుఎక్కువ,ఏమిటి అది ?
జవాబు చూడండి
జ. Ans.ఉల్లిపాయ
-
48. ఎందరుఎక్కినవిరగనిమంచం,ఏమిటి అది ?
జవాబు చూడండి
జ. Ans.అరుగు
-
49. కారుగానికారుపరుగులోమహాజోరు,ఏమిటి అది ?
జవాబు చూడండి
జ. Ans.పుకారు
-
50. ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి?
జవాబు చూడండి
జ. తేనెపట్టు
ఇంకా చదవండి
సాంప్రదాయ తెలుగు పొడుపు కథలు (traditional folk riddles), compiled from public sources.