పొడుపు కథలు — సంపుటి 3
50 పొడుపులు · సమాధానాలతో · సంపుటి 3/12
జవాబు ఊహించండి, తర్వాత "జవాబు చూడండి" నొక్కి సరిచూసుకోండి — పిల్లలతో పెద్దలతో కలిసి ఆడే సరదా ఆట! Guess each riddle before revealing the answer.
-
1. ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు?
జవాబు చూడండి
జ. అరిటాకు
-
2. ఆలు కాని ఆలు?
జవాబు చూడండి
జ. వెలయాలు
-
3. అందం కాని అందం?
జవాబు చూడండి
జ. పరమానందం, బ్రహ్మానందం
-
4. ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు?
జవాబు చూడండి
జ. చీమలదండు
-
5. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది?
జవాబు చూడండి
జ. జ.దీపం వెలుగు.
-
6. ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?
జవాబు చూడండి
జ. పొగ
-
7. కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది?
జవాబు చూడండి
జ. మేఘం
-
8. తలపుల సందున మెరుపుల గిన్నె?
జవాబు చూడండి
జ. దీపం
-
9. తల్లి దయ్యం, పిల్ల పగడం?
జవాబు చూడండి
జ. రేగుపండు
-
10. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర?
జవాబు చూడండి
జ. కొవ్వొత్తి
-
11. నల్లకుక్కకు నాలుగు చెవులు?
జవాబు చూడండి
జ. లవంగం
-
12. ఒకటే తొట్టి, రెండు పిల్లలు?
జవాబు చూడండి
జ. వేరుశనగ
-
13. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు?
జవాబు చూడండి
జ. ఉల్లిపాయ
-
14. దాని పువ్వు పూజకు రాదు. దాని ఆకు దొప్పకు రాదు, దాని పండు అందరు కోరు?
జవాబు చూడండి
జ. చింతపండు
-
15. తొలుతో చేస్తారు. కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు?
జవాబు చూడండి
జ. మద్దెల
-
16. తోలు నలుపు, తింటే పులుపు?
జవాబు చూడండి
జ. చింతపండు
-
17. తొలు తియ్యన, గుండు మింగన్నా?
జవాబు చూడండి
జ. అరటి పండు
-
18. జానెడు ఇంట్లో, మూరెడు కర్ర?
జవాబు చూడండి
జ. కుండలో గరిటె.
-
19. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది?
జవాబు చూడండి
జ. జ.తాటిచెట్టు
-
20. కొప్పుంది కాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు?
జవాబు చూడండి
జ. కొబ్బరి కాయ
-
21. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?
జవాబు చూడండి
జ. నత్త
-
22. పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?
జవాబు చూడండి
జ. పత్తి కాయ.
-
23. నూరు పళ్లు, ఒకటే పెదవి?
జవాబు చూడండి
జ. దానిమ్మ
-
24. సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు?
జవాబు చూడండి
జ. సూది
-
25. పోకంత పొట్టోడు. ఇంటికి గట్టోడు?
జవాబు చూడండి
జ. తాళం కప్ప
-
26. అమ్మ తమ్ముడిని కాను, కానీ నేను మీకు మేనమాను?
జవాబు చూడండి
జ. చందమామ
-
27. అరటి పండుకి పదే విత్తులు?
జవాబు చూడండి
జ. బొగడగొట్టం
-
28. అడవిలో ఆంబోతు రంకే వేస్తుంది?
జవాబు చూడండి
జ. గొడ్డలి
-
29. అర చేతి కింద అరిసె?
జవాబు చూడండి
జ. పిడక
-
30. అలాము కొండకు సలాము కొట్టు?
జవాబు చూడండి
జ. గొడ్డలి
-
31. అమ్మంటే దగ్గరకు.. అయ్యంటే దూరంగా పోయేవి ఏమిటి?
జవాబు చూడండి
జ. పెదవులు
-
32. అంక పొంకలు లేనిది?
జవాబు చూడండి
జ. శివలింగం
-
33. అడవిలో అక్కమమ తల విలబోసుకుంది?
జవాబు చూడండి
జ. ఈతచెట్టు
-
34. తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది?
జవాబు చూడండి
జ. అత్తి చెట్టు
-
35. తొడిమ లేని పండు, ఆకులేని పంట?
జవాబు చూడండి
జ. విభూది పండు, ఉప్పు
-
36. తన్ను తానే మింగి, మావమౌతుంది?
జవాబు చూడండి
జ. మైనపు వత్తి
-
37. చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు?
జవాబు చూడండి
జ. అద్దం
-
38. చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు?
జవాబు చూడండి
జ. టెంకాయ
-
39. తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు?
జవాబు చూడండి
జ. రైలు
-
40. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది?
జవాబు చూడండి
జ. నీడ
-
41. దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు?
జవాబు చూడండి
జ. వల
-
42. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి?
జవాబు చూడండి
జ. ఉంగరం
-
43. పొడవాటి మానుకి నీడే లేదు?
జవాబు చూడండి
జ. దారి
-
44. పోకంత పొట్టి బావ, కాగంత కడప మోస్తాడు?
జవాబు చూడండి
జ. పొయ్యి
-
45. ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది?
జవాబు చూడండి
జ. అత్తిపత్తి
-
46. ముద్దుగా నుండును, ముక్కు పైకెక్కు, చెవులు రెండూ లాగి చెంప నొక్కు దండి పండితులకు దారి చూపుట వృత్తి?
జవాబు చూడండి
జ. కళ్లజోడు.
-
47. పైడి పెట్టెలో ముత్యపు గింజ?
జవాబు చూడండి
జ. వడ్లగింజ
-
48. తల్లి కూర్చొండు, పిల్ల పారాడు?
జవాబు చూడండి
జ. కడవ, చెంబు
-
49. పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు?
జవాబు చూడండి
జ. మొగలిపువ్వు.
-
50. ఎవడికి చేయులు కాళ్లు లేవు, అయినా ఎక్కుతాడు మరియు దిగుతాడు?
జవాబు చూడండి
జ. జవాబు: మద్యం (దారూ)
ఇంకా చదవండి
సాంప్రదాయ తెలుగు పొడుపు కథలు (traditional folk riddles), compiled from public sources.