పొడుపు కథలు — సంపుటి 10
50 పొడుపులు · సమాధానాలతో · సంపుటి 10/12
జవాబు ఊహించండి, తర్వాత "జవాబు చూడండి" నొక్కి సరిచూసుకోండి — పిల్లలతో పెద్దలతో కలిసి ఆడే సరదా ఆట! Guess each riddle before revealing the answer.
-
1. నేను ప్రపంచాన్ని పర్యటిస్తాను మరియు నేను నిరంతరం తాగుతూ ఉంటాను.నేను ఎవరు?
జవాబు చూడండి
జ. జవాబు: నీరు
-
2. పిచ్చోడు కాదు,పేపర్లు చింపుతాడు,భిచ్చగాడు కాదు,అడుకుంటడు,ఎవరు ?
జవాబు చూడండి
జ. బస్సు కండక్టర్
-
3. నామం ఉంటుంది కానీ పూజారి కాదు,వాలముంటుంది కాని కోతి కాదు,ఎమిటది?
జవాబు చూడండి
జ. ఉడుత
-
4. ఓహొయి రాజా,ఒడ్డు పొడుగేమి,పట్టుకోబోతే పిడికెడు లేవు,ఎమిటది?
జవాబు చూడండి
జ. పొగ
-
5. కాళ్లు లేవు గానీ నడుస్తుంది,కళ్లు లేవు గానీ ఏడుస్తుంది,ఎమిటది?
జవాబు చూడండి
జ. మేఘం
-
6. చూస్తే చూసింది గానీ కళ్లు లేవు,నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు,తంతే తన్నింది గాని కాలు లేదు,ఎమిటది?
జవాబు చూడండి
జ. అద్దం
-
7. జానెడు ఇంట్లో,మూరెడు కర్ర,ఎమిటది?
జవాబు చూడండి
జ. కుండలో గరిటె
-
8. కుడితి తాగదు,మేత మేయదు,కానీ కుండెకు పాలిస్తుంది,ఎమిటది?
జవాబు చూడండి
జ. జ.తాటిచెట్టు
-
9. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు,అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు,ఎమిటది?
జవాబు చూడండి
జ. నత్త
-
10. పైన చూస్తే పండు,పగుల గొడితే బొచ్చు,ఎమిటది?
జవాబు చూడండి
జ. పత్తి కాయ
-
11. పొట్టలో వేలు,నెత్తి మీద రాయి,ఎమిటది?
జవాబు చూడండి
జ. ఉంగరం
-
12. పొడవాటి మానుకి నీడే లేదు,ఎమిటది
జవాబు చూడండి
జ. దారి
-
13. పోకంత పొట్టి బావ,కాగంత కడప మోస్తాడు,ఎవరది?
జవాబు చూడండి
జ. పొయ్యి
-
14. ముట్టుకుంటే ముడుచుకుంటుంది,పట్టుకుంటే గుచ్చుకుంటుంది,ఎవరది?
జవాబు చూడండి
జ. అత్తిపత్తి
-
15. ముద్దుగా నుండును,ముక్కుపైకెక్కు,చెవులు రెండూ లాగి చెంప నొక్కు,దండి పండితులకు దారి చూపుట వృత్తి,ఎమిటది?
జవాబు చూడండి
జ. కళ్లజోడు
-
16. పైడిపెట్టెలో ముత్యపు గింజ,ఎమిటది?
జవాబు చూడండి
జ. వడ్లగింజ
-
17. తల్లి కూర్చొండు, పిల్ల పారాడు,ఎమిటది?
జవాబు చూడండి
జ. కడవ, చెంబు
-
18. పూజకు పనికిరాని పువ్వు,పడతులు మెచ్చే పువ్వు,ఎమిటది?
జవాబు చూడండి
జ. మొగలిపువ్వు
-
19. అలాము కొండకు,సలాము కొట్టు,ఎమిటది?
జవాబు చూడండి
జ. గొడ్డలి
-
20. అమ్మంటే దగ్గరకు..అయ్యంటే దూరంగా పోయేవి.ఏమిటి?
జవాబు చూడండి
జ. పెదవులు
-
21. అంక పొంకలు లేనిది,ఎమిటది?
జవాబు చూడండి
జ. శివలింగం
-
22. అడవిలో అక్కమమ తల విలబోసుకుంది,ఎమిటది?
జవాబు చూడండి
జ. ఈతచెట్టు
-
23. మనిషికి రెండే కాళ్లు,ఏడు చేతులు,ఎమిటది?
జవాబు చూడండి
జ. నిచ్చెన
-
24. మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా ,బయటకు బయలుదేరుతుంది,ఎమిటది?
జవాబు చూడండి
జ. గొడుగు
-
25. నల్లని షర్టువాడు,కావలికి గట్టివాడు,ఎమిటది?
జవాబు చూడండి
జ. తాళం
-
26. బండకు కొడితే వెండి ఊడుతుంది,ఎమిటది?
జవాబు చూడండి
జ. కొబ్బరికాయ
-
27. అమ్మతమ్ముడినికాను,కానీ నేను మీకు మేనమాను,ఎవరు నేను?
జవాబు చూడండి
జ. చందమామ
-
28. అడవిలో ఆంబోతు రంకే వేస్తుంది,ఎమిటది?
జవాబు చూడండి
జ. గొడ్డలి
-
29. అరచేతి కింద అరిసె,ఎమిటది?
జవాబు చూడండి
జ. పిడక
-
30. అడ్డ గోడ మీద పూజారప్ప,ఎమిటది?
జవాబు చూడండి
జ. తేలు
-
31. అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు,ఎమిటది?
జవాబు చూడండి
జ. ఆకలి
-
32. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, మహలక్ష్మిలాగుంది. ఏమిటది?
జవాబు చూడండి
జ. గడప
-
33. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. మా ఇంటికొచ్చింది. తైతక్క లాడింది. ఏమిటది?
జవాబు చూడండి
జ. చల్ల కవ్వం
-
34. అమ్మ కడుపున పడ్డాను, అంతా సుఖాన ఉన్నాను. నీచే దెబ్బలు తిన్నాను. నిలువునా ఎండిపోయాను. నిప్పుల గుండు తొక్కాను, గుప్పెడు బూడిద అయ్యాను. ఎవరు నేను?
జవాబు చూడండి
జ. పిడక
-
35. అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు. కొమ్మ కొమ్మకూ కోటి పువ్వులు. అన్ని పువ్వుల్లో రెండే కాయలు. ఏమిటవి?
జవాబు చూడండి
జ. ఆకాశం, చుక్కలు, సూర్యుడు, చంద్రుడు
-
36. అడవిలో పుట్టాను. మేడరింట్లో వెలిగాను, వంటినిండా గాయాలు, కడుపు నిండా గేయాలు. ఏమిటది?
జవాబు చూడండి
జ. మురళి
-
37. అడుగులు ఉన్నా, కాళ్ళు లేనిది ఏది?
జవాబు చూడండి
జ. గజం బద్ద / స్కేలు
-
38. ఈ ప్రపంచం లోని వారందరూ నా బిడ్డలే, కానీ అమ్మ అని నన్నెవరూ పిలవరు. ఏం చేయాలన్నా, ఏమి పొందాలన్నా నా లోనే; ఎటు వెళ్ళాలన్నా నామీదే. నేను ఎవరిని?
జవాబు చూడండి
జ. భూమి
-
39. కిటికిట తలుపులు. కిటారు తలుపులు. తీసినా, వేసినా చప్పుడు కావు. ఏమిటవి?
జవాబు చూడండి
జ. కంటి రెప్పలు
-
40. కాళ్ళు ఉన్నా పాదాలు లేనిది?
జవాబు చూడండి
జ. కుర్చీ
-
41. రాజుగారి తోటలో రోజాపూలు. చూసేవారే గాని లెక్క వేసేవారు లేరు.
జవాబు చూడండి
జ. చుక్కలు
-
42. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది. ఏమిటది?
జవాబు చూడండి
జ. నీడ
-
43. తనను తానే మింగి, మాయమవుతుంది. ఏమిటది?
జవాబు చూడండి
జ. కొవ్వొత్తి
-
44. తొడిమ లేని పండు, ఆకులేని పంట. ఏమిటది?
జవాబు చూడండి
జ. విభూది పండు
-
45. ముగ్గురు అన్నదమ్ములు, రాత్రి, పగలు నడుస్తూనే ఉంటారు. ఎవరు వారు?
జవాబు చూడండి
జ. గడియారం ముళ్ళు
-
46. సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి, ఊరిలోకి వచ్చి ఉరుముతుంది. ఎవరది?
జవాబు చూడండి
జ. శంఖం
-
47. ఎందరు ఎక్కినా విరగని మంచం. ఏమిటది?
జవాబు చూడండి
జ. అరుగు
-
48. మనిషి కాదు కాని మాట్లాడగలడు, పాటగాడు కాదుగాని పాడగలడు. కథలు ఎన్నో చెప్తాడు కాని, ఉపాధ్యాయుడు కాడు. ఎవరు వారు?
జవాబు చూడండి
జ. రేడియో
-
49. రెండు కాళ్ళు ఉన్నాయి, కాని మనిషి కాదు. గాలిని భుజించి, మనిషిని మోసుకొని వెళ్తాడు. ఎవరు వారు?
జవాబు చూడండి
జ. సైకిల్
-
50. కాళ్ళు, చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు. ఎవరది?
జవాబు చూడండి
జ. ఉల్లిపాయ
ఇంకా చదవండి
సాంప్రదాయ తెలుగు పొడుపు కథలు (traditional folk riddles), compiled from public sources.