ముఖ్య కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు సంపద

పొడుపు కథలు — సంపుటి 11

50 పొడుపులు · సమాధానాలతో · సంపుటి 11/12

జవాబు ఊహించండి, తర్వాత "జవాబు చూడండి" నొక్కి సరిచూసుకోండి — పిల్లలతో పెద్దలతో కలిసి ఆడే సరదా ఆట! Guess each riddle before revealing the answer.

  1. 1. నల్లకుక్క పిల్లకు నాలుగు చెవులు. అది ఎవరు?

    జవాబు చూడండి

    జ. లవంగం

  2. 2. అందరినీ పైకి తీసుకువెళతాను కానీ, నేను మాత్రం పైకి వెళ్ళలేను. ఎవరిని నేను?

    జవాబు చూడండి

    జ. నిచ్చెన

  3. 3. నాకు కన్నులైతే చాలా ఉన్నాయి, చూసేది మాత్రం రెండింటి తోనే. ఎవరిని నేను?

    జవాబు చూడండి

    జ. నెమలి

  4. 4. ఒళ్ళంతా ముళ్ళంట, ఆకుపచ్చని మేనంట, బరువు చూస్తే బోలెడంత, కడుపు చూస్తే బిడ్డలంట. ఎవరు వారు?

    జవాబు చూడండి

    జ. పనసకాయ

  5. 5. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నాల మాణిక్యాలు. ఎవరు వారు?

    జవాబు చూడండి

    జ. పనస పండు

  6. 6. ఎర్రని చిన్నోడు, వేలంతైనా ఉండడు. కొరికితే మాత్రం, ఆ కోపానికి మనం ఆగలేము.

    జవాబు చూడండి

    జ. మిరపకాయ

  7. 7. తండ్రి నున్నన, తల్లి మెత్తన, బిడ్డలు కటిక రాళ్ళు. ఎవరు వారు?

    జవాబు చూడండి

    జ. జామపండు

  8. 8. అందమైన ఆభరణాల భరిణ. అందులో పసిడి పానుపు. దానిపై అమర్చిన కెంపులు. ఏమిటది?

    జవాబు చూడండి

    జ. దానిమ్మ పండు

  9. 9. వానాకాలంలో, ఎండాకాలంలో విరిసే నల్ల కలువని నేను. ఎవరిని?

    జవాబు చూడండి

    జ. గొడుగు

  10. 10. నుంచున్న చోటునుంచి కదలలేను, నాలుగు కాళ్ళున్నా నడవలేను. ఇంతకీ నేను ఎవరిని?

    జవాబు చూడండి

    జ. మంచం

  11. 11. రాత్రివేళ రాచరికం, పగలైతే పేదరికం, ఆకాశపు ముద్దుబిడ్డ, అందరికీ ఇష్టమైన బిడ్డ. ఏమిటది?

    జవాబు చూడండి

    జ. చంద్రుడు

  12. 12. ఆకాశంలో ఈత, కర్ణ కఠోరపు మోత.

    జవాబు చూడండి

    జ. విమానం

  13. 13. మా ఇంటి వెనుక ఇంగువ చెట్టు, ఎంత కోసినా గుప్పెడు కాదు.

    జవాబు చూడండి

    జ. పొగ గొట్టం

  14. 14. ఆకులేయదు, నీరు త్రాగదు, నేలను పాకదు.

    జవాబు చూడండి

    జ. కరెంటు తీగ

  15. 15. వంద మంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు.

    జవాబు చూడండి

    జ. చీపురు కట్ట

  16. 16. తడిస్తే గుప్పెడు, ఎండితే బుట్టెడు.

    జవాబు చూడండి

    జ. దూది

  17. 17. పన్నెండు చొక్కాలున్నా, నెలకు ఒకటి మాత్రమే మార్చుకుంటాడు.

    జవాబు చూడండి

    జ. క్యాలెండరు

  18. 18. గాలిలో పుడుతుంది, గాలితోనే పెరుగుతుంది. గాలి ఎక్కువైతే చచ్చిపోతుంది.

    జవాబు చూడండి

    జ. గాలి బుడగ

  19. 19. పొడవు జానెడే కాని, పొట్టనిండా ముత్యాలే.

    జవాబు చూడండి

    జ. బెండకాయ

  20. 20. ఆకు పచ్చని ఒళ్ళు, దేహమంతా కళ్ళు.

    జవాబు చూడండి

    జ. సీతాఫలం

  21. 21. చిటపట చినుకులు, చిటారి చినుకులు, ఎంత రాలినా చప్పుడు కావు.

    జవాబు చూడండి

    జ. కన్నీళ్లు

  22. 22. చక్కనమ్మ చిక్కినా అందమే. ఎవరది?

    జవాబు చూడండి

    జ. సబ్బు

  23. 23. చేత్తో పారేసి, నోటితో ఏరుకునేవి. ఏమిటవి?

    జవాబు చూడండి

    జ. అక్షరాలు

  24. 24. నాలుగు కర్రల మధ్య నల్లని రాయి. ఏమిటది?

    జవాబు చూడండి

    జ. పలక

  25. 25. ఒక స్తంభానికి నలుగురు దొంగలు. ఎవరు వారు?

    జవాబు చూడండి

    జ. లవంగం

  26. 26. కానరాని విత్తనం, ఘనమైన చెట్టు. ఏమిటది?

    జవాబు చూడండి

    జ. మర్రి చెట్టు

  27. 27. పచ్చని చెట్టు క్రింద ఎర్రని చిలక. ఏమిటది?

    జవాబు చూడండి

    జ. మిరప పండు

  28. 28. తెల్లని పోలీసుకూ నల్లని టోపీ. ఎవరా పోలీసు?

    జవాబు చూడండి

    జ. అగ్గి పుల్ల

  29. 29. గది నిండా రత్నాలు, గదికి తాళం. ఏమా గది?

    జవాబు చూడండి

    జ. దానిమ్మ పండు

  30. 30. ఎర్రని కోటలో తెల్లని భటులు. ఎవరు వారు?

    జవాబు చూడండి

    జ. పళ్ళు

  31. 31. ఊరంతా తిరిగి, మూలన కూర్చునేవి. ఏమిటవి?

    జవాబు చూడండి

    జ. చెప్పులు

  32. 32. కవలల అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం. దగ్గర దగ్గర ఉన్నారు. దరికి చేరలేకున్నారు. ఎవరా కవలలు?

    జవాబు చూడండి

    జ. కళ్ళు

  33. 33. తోకలేని పిట్ట తొంభై ఆమడల దూరం పోతుంది. ఏమా పిట్ట?

    జవాబు చూడండి

    జ. ఉత్తరం

  34. 34. ఆకుల కట్ట, పూల బుట్ట. ఏమా బుట్ట?

    జవాబు చూడండి

    జ. చెట్టు

  35. 35. దానిని కొట్టాలంటే నీళ్ళు తప్పక ఉండాల్సిందే.

    జవాబు చూడండి

    జ. ఈత

  36. 36. వీధి రాజుకి కొప్పు ఉంది కానీ, జుట్టు లేదు. కళ్ళు ఉన్నాయి కానీ, చూపు లేదు. ఎవరా రాజు?

    జవాబు చూడండి

    జ. కొబ్బరి కాయ

  37. 37. చక్కని రెక్కలు ఉన్నాయి కానీ, పక్షిని కాను. గిరగిరా తిరుగుతాను కానీ, గానుగను కాను. మరి నేను ఎవరిని?

    జవాబు చూడండి

    జ. ఫ్యాన్

  38. 38. వారు ఇద్దరు పిల్లలు. అమ్మంటే దగ్గరకొస్తారు, నాన్నంటే దూరంగా వెళ్తారు. ఎవరా పిల్లలు?

    జవాబు చూడండి

    జ. పెదవులు

  39. 39. అందరి దగ్గరా ఉంటుంది, ఎంత కోసినా, ఎదుగుతుంది. ఏమిటది?

    జవాబు చూడండి

    జ. జుట్టు

  40. 40. ముగ్గురు అన్నదమ్ములకు ఒకటే టోపీ. ఏమా టోపీ?

    జవాబు చూడండి

    జ. తాటి పండు

  41. 41. సంతలన్నీ తిరుగుతాడు, సమానంగాంచుతాడు. ఎవరతను?

    జవాబు చూడండి

    జ. త్రాసు

  42. 42. అది మనకు మాత్రమే సొంతమైంది. కానీ మనకన్నా దీన్ని ఇతరులే వాడుతుంటారు. ఏమిటది?

    జవాబు చూడండి

    జ. పేరు

  43. 43. నాకు బోలెడంత ఆకలి, ఏమైనా తినిపిస్తే వెంటనే లేచి కూర్చుంటా, ఎండినవైతే మరీ ఇష్టం. అవి తిని ఉత్సాహంతో ఎగసి పడతా. కానీ నీళ్ళు మాత్రం త్రాగించకూడదు. ఎవరిని నేను?

    జవాబు చూడండి

    జ. అగ్ని

  44. 44. నీటిలో ఉంటే ఎగసి పడతాను. నేలమీదకు రాగానే కూలబడతాను. ఎవరిని నేను?

    జవాబు చూడండి

    జ. కెరటం

  45. 45. వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాను, చీకటి పడితే మాయమవుతాను. ఎవరో చెప్పగలరా?

    జవాబు చూడండి

    జ. నీడ

  46. 46. నన్ను మీరు కొలవగలరు. నా గురించి మాట్లాడగలరు. నన్ను బట్టే మీరు ఏమి చేయాలో నిర్ణయించుకుంటారు. కానీ నన్ను తాకలేరు, ఆపలేరు. మరి నేను ఎవరిని?

    జవాబు చూడండి

    జ. సమయం

  47. 47. నేను గాలి కన్నా తేలికైన దాన్ని, అందుకే గాలిలో తేలిపోతుంటాను. వంద మంది కలిసినా నన్ను పట్టుకోలేరు. ఎవరైనా ముట్టుకుంటే, నేను మాయమవుతాను. మరి నేను ఎవరిని?

    జవాబు చూడండి

    జ. నీటి బుడగ

  48. 48. కొన్నప్పుడు నల్లగా ఉంటాను. వాడినప్పుడు ఎర్రగా మారతాను. తీసి వేయాలనుకున్నప్పుడు బూడిద రంగులోకి వస్తాను. నేను ఎవరో చెప్పగలరా?

    జవాబు చూడండి

    జ. బొగ్గు

  49. 49. పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను. మాట్లాడగలను కానీ మనిషిని కాను. ఆకాశాన ఉండగలను కానీ మేఘాన్ని కాను. మరి నేను ఎవరిని?

    జవాబు చూడండి

    జ. చిలుక

  50. 50. నాకు రెక్కలుంటాయి కాని పక్షిని కాను, బయట ఎక్కడా తిరగలేను. అడవుల్లోనూ ఉండలేను. ఇళ్ళల్లో మాత్రమే నేనుంటాను, మీరు చెప్పినట్లే నడుచుకుంటాను. నేను ఎవరైయుంటాను?

    జవాబు చూడండి

    జ. ఫ్యాన్

ఇంకా చదవండి

సాంప్రదాయ తెలుగు పొడుపు కథలు (traditional folk riddles), compiled from public sources.