పొడుపు కథలు — సంపుటి 12
16 పొడుపులు · సమాధానాలతో · సంపుటి 12/12
జవాబు ఊహించండి, తర్వాత "జవాబు చూడండి" నొక్కి సరిచూసుకోండి — పిల్లలతో పెద్దలతో కలిసి ఆడే సరదా ఆట! Guess each riddle before revealing the answer.
-
1. నాలో బోలెడు నదులున్నాయి కానీ, నీళ్ళు మాత్రం లేవు. ఎన్నో దారులు కనిపిస్తాయి కానీ, ఏ వాహనమూ వెళ్ళలేదు. అన్ని దేశాలూ ఉన్నాయి కానీ, భూమిని మాత్రం కాను. మరి నేను ఎవరినైయుంటాను?
జవాబు చూడండి
జ. ప్రపంచ పటం
-
2. నా నిండా రంధ్రాలే అయినా, నేను నీటిని భలేగా పట్టి ఉంచుతాను. చెప్పండి చూద్దాం.
జవాబు చూడండి
జ. స్పాంజి
-
3. మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ, మీరెవ్వరూ నన్ను చూడలేరు. మరి నేను ఎవరిని?
జవాబు చూడండి
జ. శబ్దం
-
4. అందరూ నన్ను తినటానికే కొనుక్కుంటారు. కానీ ఎవరూ నన్ను తినరు. నేను ఎవరిని?
జవాబు చూడండి
జ. కంచం
-
5. నాకు బిందెలు లేవు కానీ, నీళ్ళన్నీ దాచుకుంటాను. నాకు ఫ్రీజర్లు లేవు కానీ, ఆ నీటిని గడ్డకట్టిస్తాను. నాకు రెక్కల్లేవు కానీ, గాలిలో తేలిపోతాను. నాకు దుప్పట్లు లేవు. అందుకే గాలేస్తే దాచుకున్న నీటినంతటినీ కుమ్మరించేస్తాను. కనుక్కోండి చూద్దాం.
జవాబు చూడండి
జ. మేఘం
-
6. నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను. మురికిగా ఉంటే తెల్లగా అయిపోతా.
జవాబు చూడండి
జ. బ్లాక్ బోర్డ్
-
7. నేను కరిచేస్తాను కానీ, పళ్ళు లేవు. కన్నీరు పెడతాను కానీ, నాకు కళ్ళు లేవు. ఎండ నాకు పడదు, వేడి నాకు శత్రువు. నేను ఎవరిని?
జవాబు చూడండి
జ. మంచు గడ్డ
-
8. ఓ బుల్లి ఇల్లు, అందులో ఓ పిల్ల. ఆ ఇంటికి కిటికీలు లేవు, తలుపులూ లేవు. గోడలు పగలగొట్టి మాత్రమే బయటకు రావాలి. పగలకొట్టాక మళ్ళీ లోపలికి వెళ్ళటానికి ఉండదు. ఏమా ఇల్లు?
జవాబు చూడండి
జ. కోడి గుడ్డు
-
9. తలలేదు కానీ, రక్షణకు గొడుగు ఉంది. పాములేదు కానీ, పుట్ట ఉంది. ఏమై ఉంటుంది?
జవాబు చూడండి
జ. పుట్టగొడుగు
-
10. నన్ను వేసే వాళ్ళే ఉన్నారు గానీ, తీసే వాళ్ళు లేరు. నేను ఎవరిని?
జవాబు చూడండి
జ. సున్నం
-
11. అమ్మ నాకు ఒకటి కోసి, తినమని ఇచ్చింది. ఎప్పుడైతే నేను తినటం మొదలు పెట్టానో అప్పుడది ఎర్రగా ఉంది. తినటం అయిపోగానే ఆకుపచ్చ రంగులోకి వచ్చేసింది. అది ఏమై ఉంటుంది?
జవాబు చూడండి
జ. పుచ్చకాయ
-
12. అడుగులు ఉంటాయి కానీ కాళ్ళు లేవు, పొడవుగా ఉంటాను కానీ నడవలేను. నేను ఎవరిని?
జవాబు చూడండి
జ. స్కేలు
-
13. ప్రాకుతుంది కానీ పాము కాదు. చెట్లెక్క గలదు కానీ కోతి కాదు. ఆకలి వేస్తే నీటిని మాత్రమే త్రాగగలదు
జవాబు చూడండి
జ. పూల తీగ
-
14. రెండు రాజ్యాల భీకర యుద్ధం, కత్తులు లేని నిశబ్ద పోరాటం. ఏమా పోరాటం?
జవాబు చూడండి
జ. చదరంగం
-
15. నేను చాలా అందంగా ఉంటాను. సూర్యుడి వల్లే నేను పుడతాను. ఆకాశం లోనే కనిపిస్తాను కానీ ఎటూ ఎగురలేను. నేను ఎవరినై ఉంటాను?
జవాబు చూడండి
జ. ఇంద్రధనస్సు
-
16. నాకు నిలకడే లేదు. పట్టి బంధిస్తే తప్ప ఎక్కడా ఆగలేను, దేనికీ అంటుకోను. మరి నేను ఎవరిని?
జవాబు చూడండి
జ. పాదరసం
ఇంకా చదవండి
సాంప్రదాయ తెలుగు పొడుపు కథలు (traditional folk riddles), compiled from public sources.